ICC World Cup 2023: వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ డేట్ ఫిక్స్..!

by Vinod kumar |
ICC World Cup 2023: వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ డేట్ ఫిక్స్..!
X

న్యూఢిల్లీ : భారత గడ్డపై జరగబోయే ఐసీసీ వరల్డ్ కప్‌ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాట్లపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక. ఓపెనింగ్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 4న ప్రారంభోత్సవ వేడుకలను కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే నిర్వహించాలని బీసీసీఐ ఏర్పా్ట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 3 వరకు ఆయా జట్ల వార్మప్ మ్యాచ్‌లు కూడా ముగుస్తాయి. దాంతో ఓపెనింగ్ సెర్మనీ రోజే కెప్టెన్ల మీట్ కూడా నిర్వహించనున్నారు.

ఓపెనింగ్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. దాంతో ఆ మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించడానికి ఎక్కువ సమయం ఉండదు. దాంతో ఓపెనింగ్ సెర్మనీని ఒక రోజు ముందుగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. టీమ్ ఇండియా అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో తిరువనంతపురం వేదికగా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ అనంతరం కెప్టెన్ అక్టోబర్ 4న ఉదయం తిరువనంతపురం నుంచి అహ్మదాబాద్ రానున్నాడు. మరోవైపు, ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్‌గా నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఈ కార్యక్రమ వివరాలను బోర్డు త్వరలోనే వెల్లడించనుంది.

Advertisement

Next Story

Most Viewed