ICC World Cup 2023: వరల్డ్ కప్ షెడ్యూల్‌పై గంగూలీ ఎమోషనల్ పోస్ట్..!

by Vinod kumar |
ICC World Cup 2023: వరల్డ్ కప్ షెడ్యూల్‌పై గంగూలీ ఎమోషనల్ పోస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ షెడ్యూల్‌పై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. 'భారత్‌లో వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నా. కరోనా కారణంగా నేను ప్రెసిడెంట్‌గా ఉండగా వరల్డ్ కప్ నిర్వహించలేకపోయా. ఈ వరల్డ్ కప్ ఎంత గొప్పగా ఉంటుందని ఆసక్తిగా ఉన్నా. అద్భుతమైన వేదికలు, చక్కగా అలాట్ చేశారు. ఇన్ని వేదికలు ఉన్నాయని మరే దేశమూ గర్వంగా చెప్పుకోలేదు' అని గంగూలీ అన్నాడు.

'ప్రపంచం మర్చిపోలేనంత గొప్పగా బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహిస్తుంది. బీసీసీఐ, జై షా, రోజర్ బిన్నీ.. అందరికీ కంగ్రాట్స్' అని గంగూలీ ట్వీట్ చేశాడు. గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021 టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌ను భారత్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ టోర్నీని యూఏఈకి తరలించాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed