- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీమిండియాకు షాక్.. హార్దిక్ పాండ్యాకు గాయం.. బౌలింగ్ వేసిన కోహ్లీ
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న వేళ టీమిండియాకు షాక్ తగిలింది. పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమైంది. తన తొలి ఓవర్‌లో మూడో బంతి వేయగా.. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ స్ట్రైట్‌గా బౌలర్ వైపు కొట్టాడు. దీంతో బాల్‌ను ఆపేందుకు పాండ్యా కాలు అడ్డుగా పెట్టాడు. దీంతో బాల్ కాలి మడమకు బలంగా తగలడంతో పాండ్యా గాయపడ్డాడు.
కాలు నొప్పి పుట్టడంతో వెంటనే ఫిజియో గ్రౌండ్‌లోకి వచ్చి చెక్ చేశాడు. అనంతరం హార్దిక్ పాండ్యాను స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం హార్దిక్‌కు ఫిజయో చికిత్స అందిస్తున్నాడు. హార్దిక్ గాయపడటంతో అతడి స్థానంలో విరాట్ కోహ్లీ మిగతా మూడు బంతులు బౌలింగ్ చే శాడు. మూడు బంతుల్లో రెండు సింగిల్స్ మాత్రమే కోహ్లీ ఇచ్చాడు. ఈ వరల్డ్ కప్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ సారి కప్ కొట్టాలని టీమిండియా కసరత్తులు చేస్తోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ టీమిండియాకు కీలకంగా మారడంతో.. అతడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.