ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం

by Shamantha N |
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
X

న్యూఢిల్లీ: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ వేగంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా పేషెంట్‌లకు ప్రత్యేకంగా పడకలు కేటాయించే నిర్ణయాన్ని తీసుకుంది. సోమవారం నుంచి ఢిల్లీలోని ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి 20శాతం పడకలను ప్రత్యేకంగా కరోనా పేషెంట్‌లకు రిజర్వ్ చేస్తాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలోని 117 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 20శాతం బెడ్‌లు కరోనా పేషెంట్‌ల కోసం రిజర్వ్‌లో ఉంటాయి. అంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి 2,000 బెడ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కరోనా పేషెంట్‌ను తిరిగి పంపినట్టు నాకు తెలిసింది. అలా చేయడం సరికాదు. ఏ ఆస్పత్రి కూడా అలా చేయరాదు. సదరు ఆస్పత్రికి షోకాజ్ నోటీసులు పంపాము. ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలగానే, ఆ పేషెంట్‌కు అంబులెన్స్, బెడ్ ఏర్పాటు చేయడాన్ని అదే ఆస్పత్రి బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు పేషెంట్‌లకు ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్య.. బెడ్‌లు అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకరులకు చెప్పారు. కాగా, ఢిల్లీలో పెరుగుతున్న కేసులపై స్పందిస్తూ..‘ఔను. గతవారం సుమారు 3,500 కేసులు నమోదయ్యాయి. కానీ, కేవలం 250 బెడ్‌లు మాత్రమే పేషెంట్‌లతో నిండాయి. గతవారం కేసులు పెరిగినమాట వాస్తవమే కానీ, అది పెద్ద సమస్యే కాదు. నా దృష్టిలో సవాళ్లు అంటే రెండే రెండు. మరణాలు పెరగడం ఒకటైతే.. కేసులు పుట్టలుగా పెరిగి బెడ్‌లు సరిపోక, ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యం చాలని పరిస్థితులు ఎదురవడం రెండో సవాలు. కానీ, అలాంటి దుస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed