బిగ్ బ్రేకింగ్ : హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట.. ప్రముఖులు అరెస్టు..?

by Anukaran |   ( Updated:2021-10-31 10:18:02.0  )
బిగ్ బ్రేకింగ్ : హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట.. ప్రముఖులు అరెస్టు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగి మండలం మంచిరేవులలో కొందరు పేకాట ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ దాడుల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. హీరో నాగశౌర్య ఫామ్ హౌస్‌‌ను పేకాటరాయుళ్లు తమ డెన్‌గా మార్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

వారి రాకను ముందే గమనించిన కొందరు జూదగాళ్లు అక్కడి నుంచి పారిపోగా 20 మందిని నార్సింగి పీఎస్ కు తరలించారు. వీరిలో చాలా మంది నగరానికి చెందిన ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిలో ప్లే కార్డ్స్, రూ. 6 లక్షల నగదు, 20కి పైగా కార్లను పోలీసులు సీజ్ చేశారు. కాగా, హీరో నాగశౌర్య ఐదేండ్ల పాటు ఈ ఫామ్‌హౌస్‌ను లీజ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇక్కడి పేకాట తతంగం కుర్రహీరోకు తెలిసే జరిగిందా.. తెలియకుండా నిర్వహించరా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story