యోగి ఆఫీస్ ముందు ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం

by Anukaran |   ( Updated:2020-07-18 04:05:18.0  )
యోగి ఆఫీస్ ముందు ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
X

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చోటుచేసుకుంది. అమేథీలోని భూ సమస్యపై పోలీసులు ఏ చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపిస్తూ తల్లీ కూతుళ్లు శుక్రవారం యోగి ఆఫీస్ ముందు సజీవ దహనానికి యత్నించారు. అయితే, అక్కడ పోస్టింగ్‌లో ఉన్న పోలీసులు ఈ ఘటనను చూడగానే వెంటనే రంగంలోకి చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నది. అసెంబ్లీ, లోక్‌భవన్ ఉండే హై సెక్యూరిటీ జోన్‌లోనే శుక్రవారం సాయంత్రం సుమారు 5.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఇద్దరు పోలీసులు బాధితుల గ్రామానికి చేరినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. 2018లో యోగి నివాసం ముందు ఉన్నావోకు చెందిన లైంగికదాడి బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజా ఘటన మొద్దు నిద్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎంను తట్టిలేపగలిగిందా? లేదా? రాష్ట్రంలో పాలన ఉన్నదా అసలు అంటూ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. మహిళలు, దళితులు, ఓబీసీల అభద్రతను ఈ ఘటన మరోసారి వెల్లడించిందని, రాష్ట్రంలోని జంగల్ రాజ్‌ను బహిరంగపరిచిందని కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ విమర్శలు కురిపించారు.

Advertisement

Next Story