కూతురిని డెలివరీకి తీసుకెళ్తుండగా..అనంతలోకాలకు

by Shyam |
కూతురిని డెలివరీకి తీసుకెళ్తుండగా..అనంతలోకాలకు
X

దిశ, మెదక్ : నెలలు నిండిన తన కూతురిని డెలివరీ కోసం ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, అతని మనువడు, గర్భస్థ శిశువు మృతి చెందారు.ఈ ఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గజ్వేల్‌కు చెందిన మచంత ఆశయ్య నెలలు నిండిన కూతురుతో పాటు, మనువడు, కుటుంబ సభ్యులతో కలిసి కారులో తన ఇంటికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో మనవడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి ఆశయ్య, గర్భస్థ శిశువు మరణించగా కూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed