- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్ న్యూస్.. గోదావరి నదిలో ఇద్దరి గల్లంతు
by Sumithra |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో చోటుచేసుకుంది. గల్లంతైనవారు రాజస్థాన్‌కు చెందినవారిగా సమాచారం. గత కొంతకాలంగా నందిపేట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు ఆదివారం ఉమ్మెడ సమీపంలోని గోదావరి నదికి పుణ్య స్నానం కోసం వెళ్లారు. ఎగువ నుంచి వరద భారీగా వస్తున్నది. ఈ విషయం తెలియక ముగ్గురు స్నానం చేయడానికి నదిలోకి దిగారు. వరద ఉధృతంగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయారు. స్థానికంగా ఉన్న యువకులు సాహసం చేసి ఒకరిని కాపాడగలిగారు. దేవాసీ కేతారాం (30), దేవాసీ ఈర రాం (26)లు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న నందిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Next Story