వైజాగ్ పోలీసుల ఆదాయం 2 కోట్లు

by srinivas |
వైజాగ్ పోలీసుల ఆదాయం 2 కోట్లు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ నిబంధనల ఉల్లంఘించిన వారి సంఖ్య పెరిగిపోతోంది. వీరిపై పోలీసులు జరిమానా విధిస్తున్నారు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం కనికరం చూపడం లేదు.

దీంతో విశాఖపట్టణంలో కేవలం నెల వ్యవధిలోనే నిబంధనలు ఉల్లంఘించిన వారికి 2 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించారు. నిన్న ఒక్కరోజు లోనే 8.48 లక్షల రూపాయల ఫైన్లు విధించడం విశేషం. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లఘించిన 185 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22 నుంచి నిబంధనలు వ్యతిరేకిస్తున్న వారిపై పోలీసులు జరిమానాలను విధించడం మొదలుపెట్టారు. దీంతో నాటి నుంచి నేటి వరకు మొత్తం 3,702 లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో 1,398 వాహనాలను సీజ్ చేసి, 4,197 మంది అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా లాక్‌డౌన్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 38,135 మందిపై కేసులు నమోదు చేశారు.

Tags: visakhapatnam, traffic police, lockdown, rules violation, vehicle sieze

Advertisement

Next Story

Most Viewed