కరోనా అనుమానితులే 1st టార్గెట్

by sudharani |
కరోనా అనుమానితులే 1st టార్గెట్
X

దిశ,నిజామాబాద్: తెలంగాణలో మొదటి దశలో కరోనా బాధితులను గుర్తించడమే లక్షంగా పనిచేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మరే జిల్లాలో లేని పరిస్థితి నిజామాబాద్ ఉందన్నారు. గల్ప్ దేశాలలో ఎక్కువగా ఉపాధి పొందుతున్న 2600 మంది గడచిన 25రోజుల్లో జిల్లాకు చేరుకున్నారని చెప్పారు. మొదటి దశలో వారందరిని బయటకు రాకుండా నిరోధించడమే పనిగా పెట్టుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కరోనాపై సమీక్ష నిర్వహించారు.దేశంలో తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వైరస్ విస్తరిస్తుందని గమనించి ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ విధించారని గుర్తు చేశారు. ప్లాన్ ఏ ప్రకారం ముందుకు వెళుతున్నామని అందులో ఎన్‌ఆర్‌ఐలను హోం క్వారంటైన్‌లో ఉంచి, వారిని బయటకు రాకుండా చూస్తున్నామన్నారు. ఈ విషయంలో నిజామాబాద్ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్, సీపీ, వైద్యులు, పారిశుధ్య సిబ్బంది సేవలను కొనియాడారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్‌ను నివారిద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో 16 మందికి అనుమానితులు ఉండగా 11మంది రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చాయని, మిగిలిన వారికి వైద్య సేవలు అందించి పంపిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన వారు బయట తిరిగినా, అనుమానితులు ఉన్నా, నిత్యావసర ధరలు పెంచినా, ఎలాంటి విపత్కర సహాయం కోసమైనా పోలిస్ శాఖ 100, 08462-220183 టోల్ ఫ్రీ నెంబర్‌లకు ఫిర్యాదు చేయాలని మంత్రి కోరారు. కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం 3000 కోట్లు వెచ్చించింది. జిల్లాలో 15 లక్షల జనాభాకు 3,00690 రేషన్ కార్డులు ఉండగా ఒక్కోక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు 1500 కేటాయించినట్టు తెలిపారు. నిజమాబాద్ జిల్లాకు 45 కోట్లు అవసరం ఉందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ అసుపత్రిలో మొదటి దశలో200 ఐసోలేట్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. రెండో దశలో400, మూడో దశలో 800, నాల్గో ధశలో 1300 బెడ్లు ఏర్పాటు చేస్తామని, అవసరమైతే 9000 మందికి కమ్యూనిటీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచేంత కెపాసిటితో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తీకేయ, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, లత, డిఎంహెచ్ఓలు పాల్గొన్నారు.

tags : corona, minister niranjan reddy, target corona positive victims, necessities supply

Advertisement

Next Story

Most Viewed