- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కింబెర్లీ.. అమెరికన్ యంగెస్ట్ డాక్టరేట్
దిశ, ఫీచర్స్ : పదమూడేళ్లకే డిగ్రీ, పద్నాలుగేళ్లకే పీజీ పూర్తిచేసిన ఇంటెలిజెంట్స్ గురించి వినే ఉంటారు. అంతేకాదు చిన్న వయసులోనే పట్టభద్రులకు పాఠాలు చెప్పే లిటిల్ మాస్టర్స్‌ను కూడా చూసే ఉంటారు. అయితే టీనేజ్‌లోనే పీహెచ్‌డీ పూర్తిచేయడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. కానీ అమెరికాకు చెందిన ఓ టీనేజ్ గర్ల్.. ఈ వయసులోనే పీహెచ్‌డీ పూర్తిచేసి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ పొందిన యంగెస్ట్ టీనేజర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
అమెరికాలోని మోంటానాకు చెందిన 17 ఏళ్ల కింబెర్లీ స్ట్రాబుల్ ‘కాలిఫోర్నియా ఇంటర్‌కాంటినెంటల్ యూనివర్సిటీ’లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసింది. ఈ క్రమంలో వివిధ సబ్జెక్టుల్లో డాక్టరేట్ పొందిన ప్రపంచపు అతిపిన్న వయస్కుల జాబితాలో మూడోవ్యక్తిగా, అమెరికాలో తొలి వ్యక్తిగా నిలిచింది. మొత్తం మీద ఇప్పటివరకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ను సాధించిన ఫస్ట్ యంగెస్ట్ టీనేజర్‌గా చరిత్ర సృష్టించింది. ‘గ్లోబల్ లీడర్‌షిప్’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తిచేసిన కింబెర్లీ.. తన డాక్టరేట్ పట్టాను వర్చువల్‌గా స్వీకరించింది.
‘ప్రస్తుతం నేను చట్టపరమైన అంశాలను ఎదుర్కొంటున్నాను. నా వయస్సు కారణంగా వివక్షకు గురైనా, శక్తివంచన లేకుండా పోరాడుతున్నాను. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక నా సుదీర్ఘ ప్రయాణంలో డాక్టరేట్ పూర్తి చేయడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. మా అక్క కూడా 18 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది. మా చెల్లి కూడా తన కెరీర్‌లో ఉన్నతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ప్యాషన్, డెడికేషన్ ఉంటే ఎంతదూరమైనా వెళ్లి మనం అనుకున్నది సాధించొచ్చు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. చేసే పని మీద మనకు మక్కువ ఉంటే.. గో బిగ్. ఆకాశమే మన హద్దు’ అని కింబెర్లీ చెప్పింది.