మహారాష్ట్రకు 17 లక్షల డోసులు

by Shamantha N |
మహారాష్ట్రకు 17 లక్షల డోసులు
X

న్యూఢిల్లీ: మహారాష్ట్రకు 17 లక్షల టీకా డోసులను పంపించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఇవి మహారాష్ట్రకు చేరనున్నాయి. డోసుల సరఫరాలో తమపై వివక్ష చూపుతున్నదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపణలు చేసిన తర్వాతి రోజే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు 40 లక్షల డోసులు, గుజరాత్ సుమారు 30 లక్షల డోసులు, హర్యానాకు 24 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని మహారాష్ట్ర మంత్రి అన్నారు. గుజరాత్‌లో కంటే మహారాష్ట్రలో ఎక్కువ కేసులున్నాయని, యాక్టివ్ కేసులూ ఎక్కువేనని వివరించారు. కానీ, మహారాష్ట్రకు టీకాలు తక్కువ సంఖ్యలో పంపిస్తున్నదని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed