అయోధ్య ఘట్టాన్ని ఎంతమంది వీక్షించారంటే?

by Shamantha N |
అయోధ్య ఘట్టాన్ని ఎంతమంది వీక్షించారంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని మనదేశంలోని ప్రజలే కాకుండా, విదేశాల్లోని ప్రజలు కూడా చాలా మంది వీక్షించారు. ఆగష్టు 5న జరిగిన రామమందిరం భూమి పూజ మహాఘట్టం భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

అయితే, ఆ కార్యక్రమాన్ని ఎందరు వీక్షించారనే విషయాన్ని తాజాగా ప్రసార భారతి సీఈవో శశి ఎస్ వెంపటి శనివారం ప్రకటించారు. సుమారు 16కోట్ల మందికి పైగా ప్రజలు టీవీల ద్వారా వీక్షించినట్లు తేలింది. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700కోట్ల నిమిషాల ఫ్యూయర్ షిప్ లభించినట్లు తెలుస్తోంది. మరికొందరు మొబైల్స్, లాప్‌ట్యాప్, ట్యాబ్స్ ద్వారా చూడగా వారి లెక్క తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed