‘హెల్తీ’నెస్ కోసం న్యూట్రెండ్..16:8 డైట్

by Sujitha Rachapalli |
‘హెల్తీ’నెస్ కోసం న్యూట్రెండ్..16:8 డైట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో 16:8 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(నామమాత్ర ఉపవాసం) బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 16:8 డైట్ లేదా 16:8 ప్లాన్ అంటారు. ఈ డైట్ ప్లాన్‌ అనుసరించే వ్యక్తులు రోజుకు 16 గంటలు ఉపవాసం ఉండగా, మిగిలిన 8 గంటల్లో మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తారు. ప్రతి వారంలో ఎక్కువ గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉండటం లేదా రోజులో నిర్ణీత గంటలు ఫుడ్ నివారించడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని, ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడే వారికి ఈ డైట్ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుందని ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ చెబుతోంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ ఎలా చేయాలి? ఎంతవరకు తినొచ్చు వంటి విషయాలు తెలుసుకుందాం.

సాధారణంగా వారంలో ఒకరోజు ఉపవాసం చాలా మందే ఉంటారు. అంతేకాకుండా ఊబకాయం ఉన్నవాళ్లు, పొట్ట తగ్గించుకునేవాళ్లు కూడా ఆహారం తినకుండా తమకు నచ్చిన పలు రకాల డైట్ ప్లాన్స్ పాటిస్తుంటారు. అయితే దానికంటూ నియమ నిబంధనలు, టైమ్ స్లాట్స్ ఏమీ ఉండవు. కానీ, డైట్‌ను ఓ క్రమపద్ధతిలో పాటిస్తే అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు. అందుకు ది బెస్ట్ మెథడ్‌ 16:8 డైట్ ప్లాన్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వినడానికి చాలా కొత్తగా ఉన్నా, ఈ విధానంలో చాలా ఈజీగా డైట్ ప్లాన్ ఫాలో కావచ్చు. అందుకోసం 8-గంటల ఈటింగ్ విండోను టైమ్ స్లాట్స్ ప్రకారం విభజించుకోవాలి.
– ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, లేదా
– 10 ఎ.ఎమ్ టు 6 పి.ఎమ్ లేదా
– మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు

ఫుడ్ టిప్స్:

ఈ టైమ్ ఫ్రేమ్‌లో మనకు నచ్చిన ఆహారం, స్నాక్స్‌ను కన్వియినెంట్ టైమ్స్‌లో తీసుకోవచ్చు. అంతేకాదు ఫుడ్ క్వాంటిటీ విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్ అవసరం లేదు. కానీ, ఆరోగ్యకరమైన ఆహారం తింటే మరింత మంచిది. మొలకెత్తిన విత్తనాలు, వెజిటెబుల్స్, ప్రోటీన్, ఫ్రూట్స్, బ్రౌన్ రైస్, ఫిష్, బీన్స్, నట్స్, ఎగ్స్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. అన్‌హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల మెరుగైన ఆరోగ్యం త్వరగా సొంతమవడంతో పాటు డైట్ ప్లాన్ వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కడుపునిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేగాకుండా రెగ్యులర్‌గా నీళ్లు తాగుతుండాలి. ఒక టైమ్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు భోజనాన్ని లేదా టిఫిన్ ముగిస్తే, ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు మళ్లీ ఏమీ తినొద్దు. అంటే టెక్నికల్‌గా 16 గంటలు ఉపవాసమున్నట్లు లెక్క. మహిళల విషయంలో ఓ గంట అటుఇటుగా ఉన్న పర్వాలేదు. ఇక ఉపవాస సమయంలో ఆకలిని తప్పించుకోవడానికి లేదా తినాలన్నా ధ్యాసను మళ్లించడానికి కాఫీ, హెర్బల్ టీ, నీళ్లు, జీరో కాలరీ బేవరేజెస్ స్వీకరించాలి.

బెన్‌ఫిట్స్ :

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం వల్ల కేలరీలు, అధిక కొవ్వు తగ్గడంతో పాటు, మెటబాలిజం బూస్ట్ అవుతుంది. 16:8 డైట్ ప్లాన్ పాటించడం వల్ల తప్పకుండా వెయిట్ లాస్ అవుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. టైప్2 డయాబెటిస్, హార్ట కండిషన్స్, పలు రకాలు కేన్సర్లు, న్యూరోడీజెనరెటీవ్ డిసీజ్‌లను నివారించడంలో ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడిందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

ఇంటర్మింటెంట్ ఫాస్టింగ్ ప్రస్తుత కాలంలో హెల్తీ ట్రెండ్‌గా మారగా, 16:8 ప్లాన్‌తో పాటు మరో ఐదు(5) ఈటింగ్ ప్యాటర్న్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఇందులో 5:2 కూడా ఒకటి. ఈ ఈటింగ్ విండో అమలు చేసే వాళ్లు వారంలో ఐదు రోజులు తమ రెగ్యులర్ డైట్ ఫాలో కాగా, రెండు రోజులు మాత్రం(ఉదా: సోమ, గురు) కేవలం 500 కేలరీల ఫుడ్ మాత్రం స్వీకరిస్తారు. ‘ఈట్ స్టాప్ ఈట్’ ప్లాన్ మరో విధానం. ఇందులో వారంలో రెండు రోజుల(సోమ, గురు) పాటు పూర్తిగా ఉపవాసముండగా, మిగిలిన 5రోజులు నార్మల్ డైట్ ఫాలో అవుతారు. ‘ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్’ ప్లాన్‌లో ఒక రోజు సాధారణం, మరో రోజు 24 గంటల ఉపవాసం లేదా 500 కేలరీల ఆహారానికి రిస్ట్రిక్ట్ అవుతూ వారం మొత్తం ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారు. ‘ద వారియర్ డైట్’‌లో రోజులో చాలా తక్కువ మొత్తంలో ఫ్రూట్స్, వెజిటెబుల్స్ మాత్రమే తీసుకుంటూ, రాత్రి మాత్రం లార్జ్ మీల్ స్వీకరిస్తారు. ఇదే విధానం వారం పాటు అమలు చేస్తారు. ఇక ‘స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్’లో వారంలో వారంలో ఆకలి వేయని రోజు లంచ్ లేదా డిన్నర్ తప్పించడం. 16:8 డైట్ ప్లాన్ అందరికీ ఆమోదయోగ్యమైంది కాదు. మొదటి సారి ఈ ప్రణాళిక అమలు చేసిన వారిలో త్వరగా ఆకలి వేయడంతో పాటు నీరసం, టైర్డ్‌నెస్ లక్షణాలు ఉంటాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీన్ని పాటించకపోవడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed