బ్రేకింగ్.. ఖమ్మంలో 160 కేజీల గంజాయి స్వాధీనం

by Sumithra |
బ్రేకింగ్.. ఖమ్మంలో 160 కేజీల గంజాయి స్వాధీనం
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద భారీగా గంజాయిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. కోదాడ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ జక్కుల శంకర్ రావులు వాహనాల తనిఖీల నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. .

ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న రెండు బొలేరో వాహనాలను, ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ గంజాయి ఒరిస్సా నుండి సోలాపూర్‌కు రవాణా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story