- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిక్ టాక్ సైన్‌తో కిడ్నాపర్ల చెర వీడిన టీనేజ్ గర్ల్..
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, టీనేజర్ల కిడ్నాప్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఒక్క యూఎస్‌ఏలోనే గతేడాది 3,65,348 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. ఇక పాండమిక్ టైమ్‌లో గృహహింస కేసులు కూడా పెరిగిపోగా.. అలాంటి వారిని కాపాడేందుకు ఉమెన్స్ ఫండింగ్ నెట్‌వర్క్ ‘కెనడియన్ ఉమెన్స్ ఫౌండేషన్’ సంస్థ సృష్టించిన ఓ సైన్ టిక్ టాక్‌లో వైరల్ అయింది.
కిడ్నాప్‌కు గురైన వారికి ఎదురైన వ్యక్తికి తమ అరచేతిని చూపిస్తూ.. బొటనవేలును లోపలికి లాగి, ఆపై ఇతర వేళ్లతో కప్పేస్తే తాము డొమెస్టిక్ వయొలెన్స్ ఎదుర్కొంటున్నారని సిగ్నల్ ఇస్తున్నట్లు లెక్క. 2020 ఏప్రిల్‌లో సృష్టించబడిన ఈ సైన్‌పై స్వచ్ఛంద సంస్థలతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. కాగా ఇదే సంజ్ఞ తాజాగా ఓ టీనేజర్ ప్రాణాలు కాపాడింది.
నార్త్ కరోలినాకు చెందిన 61 ఏళ్ల జేమ్స్ హెర్బర్ట్ బ్రిక్.. 16 ఏళ్ల టీనేజ్ గర్ల్‌ను కిడ్నాప్ చేసి, తన బంధువులకు విక్రయించేందుకు ఓహియోకు తీసుకెళ్లాడు. అయితే వారు ఏజ్ తక్కువగా ఉందని తిరస్కరించడంతో.. అదే కారులో సౌత్ కరోలినాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాను కిడ్నాప్ అయ్యానని తెలుసుకున్న అమ్మాయి.. తప్పించుకునేందుకు తమ కారు వెనకాలే ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి డొమెస్టిక్ వయొలెన్స్ సిగ్నల్ చూపించింది.
అప్పటికే టిక్ టాక్‌లో వైరల్ అయిన సదరు సైన్‌ను సీరియస్‌గా తీసుకున్న వ్యక్తి.. అనుమానాస్పదంగా కనిపిస్తున్న టొయోటా ప్యాసింజర్ కారును ఫాలో అవుతూనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ సైన్‌ను కనిపెట్టిన స్వచ్ఛంద సంస్థకు థాంక్స్ చెప్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫైనల్‌గా టిక్ టాక్ వల్ల ఒక మంచి పని జరిగిందని అభినందిస్తున్నారు. స్టుపిడిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఇంటర్నెట్.. ఇలాంటి అద్భుతాలకు వేదిక కావడం ఆనందంగా ఉందంటున్నారు.