- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలుడిని ఇంట్లోకి రానివ్వని యజమాని..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఎవరికైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కొవిడ్-19 అనుకోని తెగ ఆందోళన చెందుతున్నారు. ఇక గ్రామాల్లో అయితే, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వారిని పొలిమేరలోనికి అడుగుపెట్టనివ్వడం లేదు. ముందుగా ఐసోలేషన్‌లో ఉండి, టెస్టుల అనంతరం నెగెటివ్ అని నిర్దారణ అయ్యకే ఊర్లోకి రావడానికి అనుమతిస్తున్నారు. నా అనుకునే వాళ్లే కరోనా మహహ్మారి వలన పరాయి వాళ్లు అయిపోతున్నారు.
సరిగ్గా ఇలాంటి అమానుష ఘటనే జగిత్యాల జిల్లాలోని చింతకుంటవాడలో గురువారం వెలుగుచూసింది. కరోనా ఉందనే అనుమానంతో 15ఏళ్ల బాలుడిని యజమాని ఇంట్లోని రానివ్వలేదు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలవరానికి గురించేసింది. అయితే, ఇన్ని రోజులు ఆ బాలుడు తన అమ్మమ్మ వాళ్లో ఇంట్లో ఉండి చదువుకునేవాడు. పండుగ నేపథ్యంలో వాళ్ల ఇంటికి వెళ్లగా, అతనికి ఈ పరాభవం ఎదురైంది. స్థానికుల సమాచారం మేరకు అధికారులు వచ్చి ఆ బాలుడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.