తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసులు

by Anukaran |
తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,456 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,580కు చేరింది. కొత్తగా వైరస్ బారినపడి బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 1,292కి పెరిగింది. కాగా కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,717 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,06,105కి చేరింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 20,183 యాక్టివ్‌ కేసులు ఉండగా, 16,977 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Advertisement

Next Story