- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
4 గంటల్లో 140 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా
దిశ,తెలంగాణ బ్యూరో : భారతీయ రైల్వే ఓ నిర్ధేశిత లక్ష్యంతో 24 గంటల్లో 140 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ ను సరఫరా చేయనుంది. వీటికి సంబంధించిన 9 ట్యాంకర్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. వీటిలో 5 రైళ్లు లక్నోకు చేరుకోనున్నాయి. మిగిలిన ఎల్ఎమ్ఓ కంటైనర్లు బోకరో నుంచి ఇప్పటికే ప్రారంభమయ్యాయినట్లు సోమవారం భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటి వరకు ముంబయి నుంచి వైజాగ్, నాగ్‌పూర్, నాసిక్, లక్నో నుంచి బోకరో వరకూ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు నడిచాయి. సుమారు 150 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ లు కలిగిన 10 కంటైనర్లు నడిచినట్లు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న ఆక్సిజన్ రైలు 4 ట్యాంకర్లతో సుమారు 70 మెట్రిక్ టన్నుల ఎల్ఎమ్ఓ గల ఓ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు రాయగడ్, ఛత్తీస్ గఢ్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దుర్గపూర్ నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ కంటైనర్లను రవాణా చేసేందుకు భారతీయ రైల్వే సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వీటితో పాటు మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణాకు రైల్వే సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కంటైనర్ల రవాణాలో రైల్వే శాఖ కొన్ని నిబంధనలను రాష్ట్రాలకు తెలియజేసింది. రైలు వెళ్లే దారిలో ఆర్.యు.బి లు, ఎఫ్.ఒ.బి లు లేకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.