ప్రభుత్వ ఉత్తర్వులు పాటించని సంస్థలు సీజ్

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో: కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని అరిక‌ట్టుట‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని జీహెచ్ఎంసీ ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ తెలిపారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను పాటించ‌కుండా న‌డుపుతున్న 140 సంస్థ‌ల‌ను సీజ్ చేసిన‌ట్లు ఆయన వెల్లడించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుపుతున్న సంస్థ‌ల‌పై దాడులు చేసి సీజ్ చేసేందుకు 18 బృందాల‌ను నియ‌మించామని తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో జిమ్‌లు, కోచింగ్ సెంట‌ర్లు, ఫిట్‌నెస్ సెంట‌ర్లు, ఉద‌యం 6గంట‌ల నుండే ప్రారంభించి ఉద‌యం 10గంట‌ల‌కు మూసివేస్తున్న‌ట్లు స‌మాచారం అందింద‌ని తెలిపారు. త‌ద‌నుగుణంగా నిఘా బృందాలు ఉద‌యం 6 గంట‌ల నుండి నిర్వ‌హించిన దాడుల‌లో 8 కేంద్రాల‌ను తెరిచి ఉన్న‌ట్లు గుర్తించి సీజ్‌చేసి నిర్వాహ‌కుల‌కు నోటీసులు జారీచేశామన్నారు. అలాగే వినియోగ‌దారులు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల కొనుగోలుకు వ‌చ్చే షాపింగ్ మాల్స్‌, వాణిజ్య సంస్థ‌లు కూడా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు అన్ని మందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేస్తూ 230 సంస్థ‌ల‌కు నోటీసులు అందజేశామని స్పష్టం చేశారు. వ‌ర్త‌క వ్యాపార సంస్థ‌లు త‌మ సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజ‌ర్లు, హ్యాండ్ గ్లౌజులు అంద‌చేయాల‌ని విశ్వజిత్ సూచించారు.

Tags: Viswajith, comments, 140 companies, siezed, ghmc, hyderabad

Advertisement

Next Story

Most Viewed