ఆసుపత్రిలో మంటలు.. 13 మంది కరోనా రోగులు మృతి

by Shamantha N |   ( Updated:2021-04-22 21:26:30.0  )
ఆసుపత్రిలో మంటలు.. 13 మంది కరోనా రోగులు మృతి
X

ముంబయి : మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై సుమారు పాతికమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే అక్కడ మరో ప్రమాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 13 మంది కొవిడ్ పేషెంట్లు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తున్నది. ఆ సమయంలో ఐసీయూలో 17 మంది చికిత్స పొందుతున్నారు. 12 మంది మరణించగా.. ఐసీయూలో ఉన్న మిగిలిన ఐదుగురితో పాటు ఆస్పత్రిలోని మిగతా పేషెంట్లను పక్కనున్న హాస్పిటల్ లోకి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed