- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడపలో 13 కరోనా పేషంట్లు డిశ్చార్జ్…!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జోరుగా విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 వరకు జరిపిన కొవిడ్19 పరీక్షల్లో మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరిలో 3 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా నమోదైన 9 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 534 కి పెరిగిందని వివరించింది.
గుంటూరు (122), కర్నూలు (113) జిల్లాలు కరోనా కేసుల నమోదులో సెంచరీ మార్కును దాటేశాయి. కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న ప్రస్తుత తరుణంలో కడప జిల్లాలో కరోనా బారినపడ్డ సుమారు 13 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ 13 మంది పూర్తిగా కోలుకున్నారని, అయినప్పటికీ వారు క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్టు వైద్యులు తెలిపారు.
దీంతో ఇప్పటి వరకు ఏపీలో 534 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వివిధ ఆసుపత్రుల నుంచి 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 500 అని ప్రకటించింది. కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
Tags: corona virus, covid-19, kadapa, incresing cases