షాకింగ్.. ఆ ఇంట్లో 120 పాము పిల్లలు

by Shyam |
షాకింగ్.. ఆ ఇంట్లో 120 పాము పిల్లలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం జిల్లాలోని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని మహ్మద్ మైబెల్లి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పాములు దర్శనమిచ్చాయి. అతని ఇంటి ఆవరణలో ఉన్న ఓ బండరాయి కింద నుంచి తొలుత ఒక పాము బయటకు వచ్చింది. దానిని స్థానికుల సాయంతో అతను చంపేశాడు. అనంతరం మరోకటి రాగ దానిని కూడా చంపాడు. అయినప్పటికీ వరుసగా పాములు వస్తుండటాన్ని గమనించిన మైబెల్లి బండరాయి తొలగించి చూడగా.. దానికింద కుప్పలుకుప్పలుగా పాము పిల్లలు కనిపించాయి.

సుమారు 120 వరకు పెద్ద పాముతో పాటు దాని పిల్లలు బుసలు కొడుతూ కనిపించాయి. దీంతో వెంటనే స్థానికుల సాయంతో వాటిని మైబెల్లి హతమార్చాడు. ఒకే సారి వందలాది పాములను చూడటంతో గ్రామస్థులు కొంత భయాందోళనకు గురయ్యారు. జిల్లాలో మొన్న దంతాలపల్లి మండలంలో వెలుగుచూసిన పాములు.. నిన్న బ్రాహ్మణకొత్తపల్లిలో, నేడు నెల్లికుదురు మండలంలో వెలుగుచూడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు జంకుతున్నారు.

ఓ పాము.. వీళ్లతో రోడ్డంతా తవ్వించింది

Advertisement

Next Story