అందమైన పెదవుల కోసం 12 టిప్స్ 

by sudharani |
అందమైన పెదవుల కోసం 12 టిప్స్ 
X

దిశ, వెబ్ డెస్క్: అందమైన అమ్మాయి ముఖంలో అబ్బాయిలను మొదటగా ఆకర్షించేవి కళ్ళు ఆ వెంటనే అతని కళ్ళు చూసేది ఆమె పెదవులనేనట! ఇక అమ్మాయిలు కూడా తమ పెదాలను ఎంతో పదిలంగా చూసుకుంటారు. కానీ, ఒకోసారి ఆ పెదాలు పొడిబారి, మృదుత్వాన్ని కోల్పోయి, నల్లగా మారి చాలా ఇబ్బంది పెడతాయి. ఈ చిన్ని చిన్ని చిట్కాలు వాడితే ఆ సమస్యలకు చెక్ పెట్టేసి అందమైన గులాబీ రంగు పెదవులు సొంతం చేసుకోవచ్చు.

1. ఒక స్పూన్ బాదం నూనెలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పెదవులపై రుద్దాలి. ఇలా చేయటం వలన పెదవులు మృదువుగా మారతాయి.

2. ఆలివ్ నూనెలో కొద్దిగా పంచదార కలిపి పెదవులపై సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయటం వలన పెదవులకు తేమ అందుతుంది.

3. బాదం నూనె, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేస్తే పెదవులు తేమను కోల్పోవు.

4. తప్పనిసరిగా లిప్ గ్లాస్ (lip gloss) గాని, లిప్ స్టిక్ (lip stick) గాని రాత్రి పడుకునే ముందు తొలగించాలి. అందుకోసం బాదం ఆయిల్ (almond oil) లేదా ఆలివ్ ఆయిల్ (olive oil) వాడవచ్చు.

5. దానిమ్మ గింజలను మెత్తగా నూరి మీగడ కలిపి పెదాలకు పట్టిస్తే నల్లబడిన పెదాలు రంగు మారతాయి.

6. కీరదోస రసాన్ని రోజూ పెదాలకు పట్టించి రెండు నిముషాలు రుద్దితే మంచి రంగులోకి వస్తాయి.

7. రాత్రి పూట పెదాలపై పాల మీగడ రుద్ది కడగకుండా అలానే వదిలేస్తే పెదాలు పొడి బారడం తగ్గి తేమని సంతరించుకుంటాయి.

8. గుప్పెడు గులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలకు పట్టించాలి. ఇలా చేస్తే పెదాలు పగలకుండా మృదువుగా ఉంటాయి.

9. వారానికి ఒకసారి టూత్ బ్రష్ (tooth brush) తో పెదాలపైన మృదువుగా రుద్దితే అక్కడ మృత చర్మం తొలగి పోతుంది.

10. టొమాటో గుండ్రని ముక్కని తీసుకుని దానిపై తేనె వేసి పెదవులపై 5 నిముషాలు రుద్దాలి. తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే పెదాలు తాజాగా మారతాయి.

11. ఒకసారి వాడిన గ్రీన్ టీ బ్యాగ్ (green tea bag) ని పడేయకుండా పెదవులపైన 4 నిముషాలు అలానే ఉంచాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పెదాలు తేమగా ఉంటాయి.

12. కలబంద సహజ మాయిశ్చర్. కలబంద గుజ్జును (aloe vera gel) పాలలో కలిపి పెదాలకు రాసుకోవాలి. పగిలి మంట పుడుతున్న పెదాలకు ఇది మంచి ఉపశమనం. ఇలా కొన్ని రోజులు చేస్తే పెదాలు మామూలు స్థితికి వస్తాయి.

మగువలూ తెలుసుకున్నారుగా పెదవులను ఎలా అందంగా మార్చుకోవచ్చో…. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చిన చిట్కా ఫాలో అయి ఆకర్షణీయమైన పెదవులను సొంతం చేసుకోండి.

Advertisement

Next Story

Most Viewed