బిగ్ బ్రేకింగ్: బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

by Anukaran |   ( Updated:2021-07-05 05:42:23.0  )
బిగ్ బ్రేకింగ్: బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏడాది పాటు తాత్కాలిక స్పీకర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు తాత్కాలిక స్పీకర్‌ను దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సస్పెండ్ చేస్తూ తాత్కాలిక స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై స్పీకర్ కొడెల శివప్రసాదరావు సస్పెన్షన్ వేటు వేయడం దుమారం రేపిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో అప్పటి సీఎం చంద్రబాబును కామ సీఎం అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ కొడెల నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రోజా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది. చివరికి సస్పెండ్ సమయం ముగిసిన ఏడాది తర్వాత రోజా తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed