- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Black Fungus Cases : దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎన్నో తెలుసా..?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితోపాటు బ్లాక్ ఫంగస్ కేసులు చాపకింది నీరులా విజృంభిస్తున్నాయి. ఈ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తం కేసుల వివరాలపై స్పష్టత లేకున్నా చికిత్స పొందుతున్నవారి వివరాలను కేంద్ర మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. మంగళవారం సాయంత్రానికి దేశంలో 11,717 మంది బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నట్టు ట్విట్టర్‌లో వివరించారు. ఈ నెల 22న ఈ సంఖ్యను 8,848గా పేర్కొనడం గమనార్హం. కేవలం మూడు రోజుల్లోనే చికిత్స పొందుతున్న లేదా యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు మూడు వేలకు పెరిగింది. ఇందులో నయమైనవారు లేదా ఫంగస్‌తో బలైనవారి సంఖ్య లేకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ బారినపడ్డ వారి మొత్తం సంఖ్య మరింత అధికంగానే ఉండే అవకాశముంది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం అదనంగా 29,250 అంఫొటెరిసిన్ బీ మందులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించినట్టు కేంద్ర మంత్రి సదానంగ గౌడ పేర్కొన్నారు.
లీడింగ్‌లో గుజరాత్
బ్లాక్ ఫంగస్ కేసుల్లో మొదటి నుంచి అత్యధిక కేసులు గుజరాత్‌లోనే నమోదవుతున్నాయి. తాజాగా వెల్లడించిన జాబితాలోనూ అక్కడే అత్యధికంగా 2,859 యాక్టివ్ కేసులున్నాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(2,770) ఉన్నది. మూడు, ఐదు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్(768), తెలంగాణ(744)లున్నాయి. నాలుగోస్థానంలో 752 కేసులతో మధ్యప్రదేశ్ ఉన్నది. మే 22న వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ ఏడో స్థానంలో ఉండగా తాజాగా, ఐదో స్థానానికి ఎగబాకడం ఆందోళనకర విషయం.