- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెహ్రాడూన్‌లో 110మంది జవాన్లకు పాటిజివ్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ దేశవ్యాప్ంగా పంజా విసురుతోంది. తాజాగా దేశ భద్రతా బలగాలకు సైతం కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 110 మంది ఆర్మీ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. గత రెండు, మూడు రోజుల్లోనే 100 మందికి కరోనా పాజిటివ్ తేలిందన్నారు. అయితే, వీరికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆర్మీ సిబ్బంది ఏయే ప్రాంతాలకు వెళ్లారనేది అధికారిక రికార్డుల ప్రకారం ఆరా తీస్తున్నారు. కొవిడ్ సోకిన ఆర్మీ సిబ్బందికి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరోనా బారినపడిన వారిని క్వారంటైన్ తరలించి ఆర్మీ ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామన్నారు. అటు, ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకూ 4,102 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా. ఇప్పటి వరకు 18 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం 1,030 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు.