డ్రంకెన్ డ్రైవ్‌లో 11 మందికి జైలు శిక్ష

by Sumithra |
డ్రంకెన్ డ్రైవ్‌లో 11 మందికి జైలు శిక్ష
X

దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బుధవారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 11 మందికి జైలు శిక్ష, 105 మందికి దాదాపు రూ.4.26 లక్షలను కోర్టు జరిమానా విధించినట్టు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్, విత్ అవుట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. బుధవారం 6వ తేదీ మొత్తం 105 మంది పట్టుబడగా, అందులో డ్రంకెన్ డ్రైవ్ కేసులు 75, విత్ అవుట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ.2.99 లక్షలు, డ్రైవింగ్ లెసెన్స్ లేనివారికి రూ.1.26 లక్షలు కోర్టు జరిమానా విధించినట్టు చెప్పారు. జైలు శిక్ష పడిన వారిలో 7 గురికి రెండ్రోజులు, ముగ్గురికి మూడ్రోజులు, ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష పడ్డట్టు తెలిపారు. వీటిలో అత్యధికంగా షాద్‌నగర్‌లో 37 కేసులు, ఆర్జీఐ ఎయిర్ పోర్టు పరిధిలో 28 కేసులు, రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 25 కేసులు, కూకట్ పల్లి లో 8 కేసులు, మియాపూర్ లో 7 కేసులు నమోదు అయినట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. జైలు శిక్ష పడిన వారిలో కూకట్ పల్లి లో 8 మంది, మియాపూర్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed