- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
దిశ, పాలేరు: అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సీఐ వెంకటస్వామి, ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి , ఎస్సై రాము, టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐలు రఘు, ప్రసాద్, సిబ్బంది ఖమ్మం రూరల్ మండలం ముల్కలపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ఏపీ-01, డబ్య్లూ 6184 లారీలో రూ. 2,70,000 విలువ చేసే సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిమహబూబాబాద్ జిల్లా ఆలేరు నుంచి ఏపీలోని యానాంకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్, యజమాని కందిమల్లా శ్రీనివాస్, లారీ క్లీనర్ గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఖమ్మం రూరల్ పీఎస్‌కు తరలించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.
మరో ఘటనలో..
ఖమ్మం వన్‌టౌన్ పీఎస్ పరిధిలో లారీలో రేషన్ బియ్యం లోడ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని చూసిన డ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు. బియ్యంతో ఉన్న లారీని ఎస్‌హెచ్‌ఓ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు శ్రీనివాస్ రెడ్డి, కళింగారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్, రవి, కోటేశ్వర్, సూర్యనారాయణ పాల్గొన్నారు.