గుమ్మకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

by Sumithra |   ( Updated:2021-12-25 00:11:38.0  )
Road-Accident-1
X

దిశ, తిమ్మాజీపేట: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన కోలా కృష్ణ వ్యక్తిగత పనుల నిమిత్తం తిమ్మాజీపేట వస్తుండగా మూలమలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని మృతి చెందాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. కాగా వెనక నుండి గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Next Story