'ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై పన్నుల ఉపశమనం అవసరం'

by Harish |
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై పన్నుల ఉపశమనం అవసరం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగంలోని ఎగుమతులపై సుంకంలో 1.5 శాతం వరకు ఉపశమనం కల్పిస్తే 2025 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ ఎగుమతిదారుగా భారత్ నిలుస్తుందని పరిశ్రమల సంఘం ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) తెలిపింది. ఇటీవల ప్రభుత్వం ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమన (ఆర్‌ఓడీటీఈపీ) పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పథకం రేట్లను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. పాత పథకం ప్రకారం.. ఎగుమతి చేసిన ఉత్పత్తుల మొత్తం విలువపై ఇది 2-4 శాతం ప్రోత్సాహం ఉండేది. దీని ఫలితంగా భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతి 2017-18లో సుమారు రూ. 44 వేల కోట్ల నుంచి 2019-20 నాటికి సుమారు రూ. 82 వేల కోట్లకు పెరిగింది. ‘ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచేందుకు, 2025 నాటికి భారత ఎగుమతుల్లో ఈ రంగాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు ఆర్‌ఓడీటీఈపీ పథకం చాలా కీలకం. ఇది భారత్‌లో పెరుగుతున్న పోటీతత్వంలో నెలకొనే ప్రతికూలతను పరిష్కరించేదిగా ఉండాలి. ఆర్‌ఓడీటీఈపీ బేస్ రేటు, ప్రాధాన్యత రేట్లపై తక్షణ దృష్టి అవసరమని’ ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మోహింద్ర వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed