‘1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశాం’

by Shamantha N |
‘1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశాం’
X

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్‌ను పలు స్టీల్ ప్లాంట్స్ నుంచి సరఫరా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంట్స్ నుంచి పలు రాష్ట్రాలకు 1.43లక్షల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. కొవిడ్‌కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న సామూహిక పోరులో స్టీల్ రంగం కూడా తోడుగా ఉంటుంది. పలు రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని రూర్కెలా, ఒడిశాలోని కలింగనగర్ టాటాస్టీల్ ప్లాంట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రలకు రూర్కెలా స్టీల్ ప్లాంట్, టాటా స్టీల్ ప్లాంట్ లు ఇప్పటికే 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించాయని అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

Next Story