బనానా స్ప్రింగ్‌ రోల్స్‌

by Hamsa |   ( Updated:2020-03-20 02:39:03.0  )
బనానా స్ప్రింగ్‌ రోల్స్‌
X

కావలసినవి:
చిక్కటి పాలు – పావు కప్పు; బేకింగ్‌ సోడా– కొద్దిగా; బ్రౌన్‌ సుగర్‌ పౌడర్‌ – 5 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – చిటికెడు; బిస్కట్‌ పౌడర్‌ – 6 టేబుల్‌ స్పూన్లు; అరటిపండ్లు(బనానా) – 5 లేదా 6 (ఇరువైపులా కొద్ది కొద్దిగా తొలగించి నిలువుగా రెండు ముక్కలు చేసుకోవాలి); స్ప్రింగ్‌ రోల్‌ వేఫర్స్‌ – అరటిపండు ముక్కలను బట్టి (మార్కెట్‌లో లభిస్తాయి. ఇంట్లో చేసుకోవాలనుకుంటే.. గమనికను ఫాలో అవ్వండి); చాక్లెట్‌ క్రీమ్‌ లేదా ఐస్‌ క్రీమ్‌ – సర్వ్‌ చేసుకునేప్పుడు అభిరుచిని బట్టి

తయారీ:
ముందుగా ఒక బౌల్‌లో బ్రౌన్‌ సుగర్‌ పౌడర్, పాలు, బేకింగ్‌ సోడా, ఏలకుల పొడి, బిస్కట్‌ పౌడర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటి పండు ముక్కలకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి ఒక్కో వేఫర్‌లో ఒక్కో అరటిపండు ముక్కను పెట్టుకుని, రోల్స్‌లా చుట్టుకుని, నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. చాక్లెట్‌ క్రీమ్‌ లేదా ఐస్‌ క్రీమ్‌తో కలిపి వీటిని సర్వ్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.
గమనిక: రెండు కప్పుల మైదాపిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని.. సుమారుగా ఓ కప్పు నీళ్లు వేసుకుని ముద్దలా చేసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలా చేసుకుని ఒకదాని మీద ఒకటి ఐదు వరుసగా వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు ప్రతి పూరీ(లేయర్‌) మధ్యలో ఆయిల్‌ రాసుకుని, పొడిగా ఉన్న మైదాపిండి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ ఐదు లేయర్స్‌ని కలిపి చపాతీలా ఒత్తాలి. తర్వాత వాటిని నాన్‌స్టిక్‌ మీద ఇరువైపులా పది సెకన్లు వేడి చేయాలి. తర్వాత ఒక్కో లేయర్‌ని వేరు చేసుకుని అవసరానికి ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed