తలైవా దారి.. రాజన్న దారి!

by Shamantha N |
తలైవా దారి.. రాజన్న దారి!
X

తమిళ దర్బార్ రజినీకాంత్ రాజన్న బాటలో నడవనున్నాడా.. అంటే అవుననే అంటున్నాయి ద్రవిడ వర్గాలు. దాదాపు 20 ఏళ్ల నుంచే పాలిటిక్స్‌లోకి ఏంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతూ వస్తోన్న ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. 2014లో సెంట్రల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలపై దృష్టి పెట్టిన సూపర్‌స్టార్ రజినీకాంత్ 2017 డిసెంబర్‌లో రాజకీయ అరంగ్రేటం చేస్తానని కన్ఫామ్ చేశాడు. అప్పటి నుంచి అదిగో పార్టీ పెడుతుండు అంటే.. ఇదిగో పార్టీని అనౌన్స్ చేస్తుండు అని మీడియాలో హైప్ క్రియేట్ అయినా డీసెంట్‌గా డిమ్ముగా ఉండిపోయారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ‘దిశ’గా అడుగులు వేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘రాజన్న’ బాటలో…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటనే ఇప్పుడు రజనీకాంత్ ఎంచుకున్నట్లు తెలుగు, ద్రవిడ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర టైంలోనే వైఎస్.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా వ్యక్తిగతంగా పేదలు, రైతుల మనసు దోచుకున్నాడు. అప్పుడు వైఎస్ అనుసరించిన వ్యూహాన్ని పక్కాగా ఇప్పుడు ప్లాన్ చేసేందుకు ఏప్రిల్‌లో రజినీ.. పార్టీ ప్రకటన చేయనున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పెట్టి వెంటనే సైలెంట్ కాకుండా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జూన్ లేదా ఆగస్టులో పాదయాత్ర ప్రారంభించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ టైంలోనే పాదయాత్రకు వెళ్తే ఎండలు తగ్గి చల్లటి వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయానికే ఎన్నికల హీట్ మొదలయ్యే అవకాశాలు సైతం ఉంటాయి కాబట్టి అప్పుడే ప్రజల్లోకి వెళ్లడం సరైన సమయమని రజినీ సన్నిహితులతోపాటు పలువురు రాజకీయనేతలు సూచించారని సమాచారం.

సంఘ్ నడిపిస్తోందా !

2014 ఎలక్షన్ టైంలో రజినీకాంత్ ఇంటికి ప్రధాని మోడీ వెళ్లడంతో తలైవా కాషాయ కండువా కప్పుకుంటారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే జరిగిన పరిణామాలతో సూపర్‌స్టార్ రజినీకాంతే పార్టీ పెడతారన్న పాయింట్ బలంగా వచ్చి రాజకీయ అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది. ఇప్పటివరకు తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. ప్రజల మధ్య నడిచి వారే అధికారంలోకి వచ్చారు. ఈక్రమంలోనే మొదట్నుంచి దక్షిణాదిలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న కమలం పార్టీ.. రజనీకాంత్‌తో పార్టీ పెట్టించి పొత్తు పెట్టుకొని ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినపడుతున్నాయి. ఇప్పటికే పాలిటిక్స్ ఎంట్రీ కన్ఫామ్ అయిన నేపథ్యంలో తలైవ ప్రస్తుత పరిస్థితుల్లో ఏవిధమైన స్టెప్ తీసుకుంటారన్నది కీలకంగా మారింది. అసలు రజినీ పొలిటికల్ గేమ్ వెనక సంఘ్ ఉండి నడిపిస్తోందని ఓ రకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తారా లేకుంటే ఒంటరిగా పోటీ చేసి తన బలం నిరూపించుకుంటారా అన్నది ముందు ముందు చూడాల్సిన అంశం.

ఈ వయస్సులో పాదయాత్ర సాధ్యమేనా ?

1950, డిసెంబర్ 12న జన్మించిన రజనీకాంత్‌కు దాదాపు 70 ఏళ్లు ఉన్నాయి. మానసికంగా గట్టిగానే ఉన్నప్పటికీ ఈ వయస్సులో పాదయాత్ర చేస్తే శరీరం ఏ మేరకు సపోర్టు చేస్తుందన్నది కూడా చూసుకోవాల్సిన పరిణామం. ఇప్పటివరకైతే హెల్త్‌ పరంగా ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే హిమాలయాలకు వెళ్లి ఒంటరిగా ధ్యానాలు చేసి మళ్లీ ఫిట్‌గా అయి రజనీకి.. 70 ఏళ్ల వయస్సులో పాదయాత్ర అంటే వైద్యులు ఎలాంటి సలహాలిస్తారన్నది చూడాల్సి ఉంది. పార్టీ పేరు అనౌన్స్ చేసి తర్వాత బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లి బలపడాతరన్న ప్రచారం కూడా జరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయంతో అడుగులు వేస్తారన్నది ప్రజెంట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed