మీకు బాధత్య లేదా.. మున్సిపల్ కమిషనర్‌పై జడ్పీటీసీ ఫైర్

by Sridhar Babu |   ( Updated:2021-07-29 21:58:46.0  )
Zptc
X

దిశ, మణుగూరు : మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు ఇష్టానుసారంగా నాటారని, నాటిన మొక్కలకు కనీసం మొక్కకు ఉన్న కవర్ తీయకుండా నాటించారని మున్సిపాలిటీ కమిషనర్‌పై మణుగూరు మండల జడ్పీటీసీ పొశం నరసింహారావు మండిపడ్డారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మున్సిపాలిటీ సిబ్బంది నాటిన మొక్కలను ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంతా పచ్చగా ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. కానీ, మణుగూరు మండలంలో మున్సిపాలిటీ కమిషనర్ మొక్కలుు నాటే విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి మున్సిపాలిటీ కమిషనర్‌గా ఉండి మండలాన్ని సస్యశ్యామలంగా చూడాల్సింది పోయి మొక్కల విషయంలో ఇలా చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు.

స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో మున్సిపాలిటీ వారు నాటిన మొక్కలు ఎండిపోయాయని, కనీసం వాటి పట్ల భద్రత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ ఆశయానికి, స్థానిక ఎమ్మెల్యే రేగా ఆశయాన్ని మున్సిపాలిటీ కమిషనర్ దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. కొన్ని వందల మొక్కలను ఎంతో ఖర్చు పెట్టి ఎమ్మెల్యే రేగా కాంతారావు తీసుకువస్తే వాటికి ఫలితం లేకుండా చేశారని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా కమిషనర్ తన పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేనిచో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, పైఅధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య కమిటీ సభ్యులు తంతరపల్లి కృష్ణ, లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed