- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారి వల్లే బతుకమ్మకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
దిశ, రాజేంద్రనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్వీరాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని ఆడిపాడారు. అనంతరం అనితారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలందరూ ఒకచోట చేరి గౌరమ్మకు పూజలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. బతుకమ్మ పండుగకు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వేడుకల్లో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, ఎంపీడీవో వినయ్ కుమార్, సీఐ ప్రకాష్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఇస్తారి, మండల పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.