- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలగించిన ఉద్యోగుల కోసం జొమాటో 'టాలెంట్ డైరెక్టరీ'!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం వల్ల అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా సంస్థలోని 520 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, కేవలం ఉద్యోగులను తొలగించి చేతులు దులుపుకోవడం ఇష్టం లేక వారికి కండాక్ట్ సర్టిఫికేట్ లాంటి అవకాశాన్ని కల్పిస్తోంది. నష్టాలు తీవ్రంగా ఉన్నందున ఉద్యోగులను తొలగించక తప్పడంలేదని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ చెప్పారు. అనేకమంది నైపుణ్యం ఉన్న వారి వల్లే జొమాటో ఈ స్థాయికి వచ్చిందని, అలా నైపుణ్యం ఉండి కూడా ఉద్యోగాలను కోల్పోయిన వారి కోసం జొమాటో సంస్థ టాలెంట్ డైరెక్టరీ పేరుతో అభ్యర్థుల ప్రొఫైల్ జాబితాను రూపొందిస్తున్నామని దీపిందర్ ట్విటర్ ద్వారా వివరించారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగాలను కోల్పోయిన వారు తమ నైపుణ్యాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. జొమాటాలో పలు విభాగాల్లో పనిచేసిన ప్రతిభావంతులైన ఉద్యోగుల జాబితా కోసం [email protected]కు మెయిల్ పంపించాలని సూచించారు. సంస్థ అభివృద్ధికి ఎంతోమంది ఉద్యోగులు నిరంతరం పాటుపడ్డారని, ముఖ్యంగా కంటెంట్ ప్రొడ్యూసర్స్, డిజైనర్స్, ఎడిటర్స్ స్థాయి ఉద్యోగులు వారిలో ఉన్నారని, వీరి జాబితాను మీకు అందిస్తామని జొమాటో ప్రతినిధులు వివరించారు.