రెట్టింపు కంటే అధిక లాభాలు సాధించిన జెరోధా

by Harish |
రెట్టింపు కంటే అధిక లాభాలు సాధించిన జెరోధా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద రిటైల్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు కంటే అధిక లాభాలను సాధించినట్టు సాధించింది. ఈ మేరకు జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నితిన్ కామత్ ఆదివారం వివరాలను వెల్లడించారు. దేశీయ రిటైల్ పెట్టుబడిదారులలో ఆన్‌లైన్ ట్రేడింగ్, స్టాక్స్‌లో పెట్టుబడులకు పెరిగిన డిమాండ్ కారణంగానే లాభాలు అధికంగా నమోదయ్యాయని ఆయన తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. కోట్ల లాభాలను ఆర్జించినట్టు ఆయన పేర్కొన్నారు.

సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 15 శాతం వృద్ధితో రూ. 1,093 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 350 కోట్లుగా నమోదైంది. తాజాగా జెరోధా వ్యవస్థాపకులైన నితిన్ కామత్, నిఖిల్ కామత్, కంపెనీ డైరెక్టర్ సీమా పాటిల్‌లు కలిసి రూ. 300 అత్యధిక వేతనానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దేశంలో ఓ కుటుంబం ఈ స్థాయి వేతనాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి.

Advertisement

Next Story