ల్యాండ్‌ వార్.. గన్‌తో కాలుస్తా అంటూ..

by Sumithra |   ( Updated:2021-01-03 10:57:22.0  )
ల్యాండ్‌ వార్.. గన్‌తో కాలుస్తా అంటూ..
X

దిశ, క్రైమ్ బ్యూరో : నగరంలోని పాతబస్తీలోని డబీర్‌పురా పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి పబ్లిక్‌గా గన్‌తో కాల్పులు జరిపి హల్ చల్ సృష్టించాడు. స్థానిక అలీ కేఫ్‌లో కూర్చుని ఆయుబ్ ఖాన్, జాకీర్‌లు టీ తాగుతున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య చిన్న విషయంతో మొదలైన చర్చ భూ వివాదాల వరకూ సాగింది. ఇదే క్రమంలో నగదు వ్యవహారం కూడా ప్రస్తావన రావడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ వివాదంలో జాకీర్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో ఆయుబ్ ఖాన్‌ను బెదిరించాడు.

ఆ తర్వాత ఒక్కసారిగా గన్ లోడ్ చేసి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడున్న హోటల్ యాజమానితో పాటు కస్టమర్లు అంతా ఉలికిపడ్డారు. ఈ విషయంపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాకీర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. అయితే, కాల్పులు జరిపిన జాకీర్ మద్యం మత్తులో ఉన్నాడు.,ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు జాకీర్‌ను విచారిస్తున్నారు.

Advertisement

Next Story