'రోహిత్ బ్యాటింగ్ స్టైల్ ఇంజమామ్‌ను గుర్తుకుతెచ్చేది'

by Shyam |   ( Updated:2020-04-05 04:22:05.0  )
రోహిత్ బ్యాటింగ్ స్టైల్ ఇంజమామ్‌ను గుర్తుకుతెచ్చేది
X

టీం ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని ఇష్టపడని వాళ్లు ఉండరు. మంచి టైమింగ్‌తో బౌండరీలు, సిక్సర్లు కొట్టడంలో తనకు తానే సాటి. కాగా, రోహిత్ బ్యాటింగ్ శైలి గురించి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. రోహిత్ టీం ఇండియాలో చోటు సంపాదించిన కొత్తలో అతడి బ్యాటింగ్ స్టైల్ పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్‌ను గుర్తు చేసేలా ఉండేదట. బంతి బౌలర్ చేతి నుంచి రిలీజైన తర్వాత చాలా సమయం ఉందనిపించేలా, ఎంపిక చేసుకొని మరీ షాట్లు కొట్టేవాడు ఇంజమామ్. అతడి టైమింగ్‌కు బౌలర్లు కూడా ఆశ్చర్యపడేవాళ్లు. అదే శైలిలో రోహిత్ బ్యాటింగ్ చేసేవాడంట. అతడిని చూసినప్పుడల్లా ఇంజమామే గుర్తొచ్చేవాడని యువీ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

కాగా, 2007లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ టీం ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో తొలి పరుగు సాధించిన రోహిత్.. ఆ తర్వాత వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టీం ఇండియా వైస్ కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు 4 సార్లు టైటిల్ అందించిన విషయం తెలిసిందే.

Tags: Yuvraj Singh, Rohit, Inzamam, Team India

Advertisement

Next Story

Most Viewed