- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు : వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ ఇంకెంత మంది యువకులను పొట్టన పెట్టుకుంటారోనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని 26 ఏండ్ల నరేశ్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది కేసీఆర్ చేసిన హత్యేనని ఆమె పేర్కొన్నారు. రోజుకో నిరుద్యోగి హత్యతో కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారన్నారు. కేసీఆర్ ది రాతి గుండె అని విమర్శలు చేశారు. ఇప్పటికే వందలమంది నిరుద్యోగులు మరణించారని, ఇంకెంత మంది చనిపోతే నోటిఫికేషన్లు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.
ఎంతమంది తల్లులకు గర్భశోకం మిగిలిస్తే మీ కండ్లు చల్లబడుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది అని ప్రశ్నించారు. వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి మనిషివే అని నిరూపించుకోవాలని సీఎం కేసీఆర్ ను షర్మిల డిమాండ్ చేశారు. ఏడేండ్ల పాలనలో సర్కార్ విద్యను, వైద్యాన్ని, బడులను భ్రష్టు పట్టించారని, పరిపాలన చేతకానప్పుడు చేయడం ఎందుకని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకెంతమంది తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయి? ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా
మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది వెంటనే రాజీనామా చేసి..ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంకా మనిషివే అని నిరూపించుకో KCR 2/2— YS Sharmila (@realyssharmila) August 13, 2021
- Tags
- job notification