మహిళా వాలంటీర్ పై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2021-03-02 10:32:57.0  )
మహిళా వాలంటీర్ పై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇటీవలే పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల వేడి రాజుకుంటుంది. అయితే పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామ వాలంటీర్లుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో వాలంటీర్లు అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. అంతేకాదు కోర్టులను సైతం ఆశ్రయించాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే వాలంటీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ చేసి మరీ దుర్భాషలాడారు. అది కూడా ఒక మహిళా గ్రామ వాలంటీర్ పై కావడం గమనార్హం. మహిళా వాలంటీర్ కి ఫోన్ చేసిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి సపోర్ట్ చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరపల్లి లో ఉన్న తన క్యాంపు ఆఫీస్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే ఆమెను ఆదేశించారు. ఉద్యోగం ఎవరిచ్చారంటూ చిర్రుబుర్రులాడారు. మహిళా వాలంటీర్ పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story