- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్ నిరాకరించిన వైసీపీ..కార్యకర్త ఆత్మహత్యాయత్నం
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ యువకుడు కీలకంగా మారాడు. అహర్నిశలు శ్రమించాడు. పార్టీ కోసం శ్రమించిన వారు పదవులు ఆశించడంలో తప్పులేదనుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించడంతో పార్టీ నేతలు అతడికే ఖరారు చేశారు. అయితే తాజాగా అతడికి టికెట్ కేటాయించకుండా వేరే వ్యక్తికి కేటాయించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే మండపేట మున్సిపాలిటీలోని ఏడవ వార్డు ఎస్సీల రిజర్వ్ అయింది. ఇక్కడి నుంచి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి గత ఏడాది సవరపు సతీష్‌కు టికెట్ కేటాయించారు. కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో తనకే మళ్లీ టికెట్ కేటాయిస్తారని సతీష్ భావించాడు. అయితే ఏడవ వార్డులో అభ్యర్థిని మార్చి సతీష్‌ను కాదని మరొకరి పేరును వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో తనకు టికెట్ రాలేదన్న మనస్థాపంతో నామినేషన్ వేసిన సవరపు సతీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సతీష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది టికెట్ కేటాయించి ఇప్పుడు మరో వ్యక్తికి టికెట్ ఖరారు చేయటంతోనే సతీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.