'దిశ'ను అవమానించిన నారా లోకేశ్‌.. మండిపడ్డ వైసీపీ

by srinivas |   ( Updated:2021-09-13 02:49:35.0  )
దిశను అవమానించిన నారా లోకేశ్‌.. మండిపడ్డ వైసీపీ
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మూడు రోజుల క్రితం దిశ చట్టం ప్రతులను తగలబెట్టడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని లోకేశ్ ఆరోపించారు. దిశచట్టం ప్రతులను తగలబెట్టిన లోకేశ్‌ శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ విజయవాడ నగర ప్రచార విభాగం అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు.. మహిళల భద్రత కోసం వైసీపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. దిశ బిల్లును శాసన సభ మరియు శాసన మండలిలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలియజేశారు. ఈ దిశ చట్టాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో మహిళలను అవమానపరిచేలా.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా లోకేశ్ దిశ చట్టం ప్రతులను తగలబెట్టడం సరికాదని వైసీపీ నేత పోతిరెడ్డి సుబ్బారెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed