- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: వైఎస్ వివేకా హత్యకేసు: సీబీఐ అధికారులతో సునీతారెడ్డి భేటీ
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలులోని గెస్ట్‌హౌస్ కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగుతుంది. పులివెందులకు చెందిన భరత్ కుమార్ యాదవ్, నాగేంద్ర, మహమ్మద్ బాషా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిలు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి, ఓ కానిస్టేబుల్, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డిలను కూడా బుధవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
సీబీఐతో వైఎస్ సునీతారెడ్డి భేటీ..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతున్న తరుణంలో వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి మరోమారు సీబీఐ అధికారులను కలిశారు. సుమారు గంట పాటు కేసు పురోగతిపై సీబీఐ అధికారులతో చర్చించారు. ఇన్నాళ్లు సీబీఐ విచారణలో ఏం జరిగిందని కేసు పురోగతి ఎంతవరకు వచ్చిందని ఆమె అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవలే వైఎస్ కుటుంబ సభ్యులు వారి అనుచరులను సీబీఐ విచారించిన నేపథ్యంలో హత్యపై ఏమైనా క్లూ తెలిసిందా అనే దానిపై ఆమె సీబీఐ అధికారులతో సునీతా చర్చించినట్లు తెలుస్తోంది.