- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ పెట్టిందే ప్రజల కోసం: వైఎస్ షర్మిల
దిశ, యాచారం: వైఎస్సార్ తెలంగాణా పార్టీ పెట్టింది మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకరావడానికే అని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలంలో కొనసాగింది. సమస్యలు అడిగి తెలుసుకున్న షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణా ప్రజలకోసం నిలబడుతా వారి కోసం సేవ చేస్తానన్నారు. రైతుల కోసం, మహిళల కోసం, ఉచిత చదువుల కోసం, పేదవారి ఉచిత వైద్యం కోసం కొట్లాడుతా అని అన్నారు. పాలకులు రాష్ట్రంలో సమస్యలే లేవు, పాలన అద్భుతంగా ఉందని చెబుతున్నారు. యువత ఏమో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించింది. తల్లిదండ్రులు కూలినాలి పనిచేసి లక్షలు వెచ్చించి మరి చదివించింది తమ పిల్లలు కూలి పనిచేసి బతకకుండా ఉద్యోగాలు చేయడానికి అని అంది.
కానీ రాష్ట్రంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌లు వేయక, ఉద్యోగాలు రాక .. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలున్నాయని.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఒక్క ఇంటికైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించింది. ఏడేళ్ళలో పోలీసు ఉద్యోగాలు 20, 30 వేలు తప్పితే ఏ ఉద్యోగాలను భర్తీ చేసింది లేదని పేర్కొన్నారు. దళిత మఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబులు బెడ్‌రూమ్ అన్నారు ఇచ్చారా అని నిలదీసింది. రాజశేఖర్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసారు, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్ ఇచ్చారు. రైతులకు ప్రతి విషయంలో అండగా నిలబడ్డారు అని తెలిపింది. కేసీఆర్ నియంత పాలనా పోవాలని, వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని అన్నారు.