స్కూళ్లు తెరవొద్దు.. షర్మిల డిమాండ్

by Shyam |
స్కూళ్లు తెరవొద్దు.. షర్మిల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరిచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వైఎస్ షర్మిల సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాలేదని ఆమె అన్నారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే పిల్లలపైనే అధిక ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఇలాంటి సమయంలో స్కూళ్లు తెరిచి విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడొద్దని ప్రభుత్వానికి ఆమె సూచించారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బడులు తెరిచే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా షర్మిల నివాళులర్పించారు.

Advertisement

Next Story

Most Viewed