విద్యార్థులతో నేడు వైఎస్ షర్మిల భేటీ

by srinivas |
 విద్యార్థులతో నేడు వైఎస్ షర్మిల భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో జిల్లాల వారీగా ముఖ్య నేతలతో భేటీ అవుతున్న వైఎస్ షర్మిల నేడు విద్యార్థులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో నిర్వహించనున్న ఈ భేటీలో 350 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. షర్మిల వారితో విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు తీరుతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు.

వరసగా భేటీలు అవుతున్న షర్మిలకు తెలంగాణ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. మంగళవారం జరిగిన భేటీలో జనగామ మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి కలిశారు. అంతకు ముందు టి.అంజయ్య కేబినెట్‌లో ఆర్థిక, హోంశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత ప్రభాకర్‌రెడ్డి వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సైతం మద్దతు తెలిపినట్లు సమాచారం.

Advertisement

Next Story