షర్మిల కాన్వాయ్‌కు ప్రమాదం

by Anukaran |   ( Updated:2021-04-09 02:40:30.0  )
షర్మిల కాన్వాయ్‌కు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల సాయంత్రం ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో కొత్త పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొనేందుకు ఉదయం లోటస్‌పాండ్ నుంచి షర్మిల ర్యాలీగా బయలుదేరగా.. అభిమానులు ఆమెకు ఎక్కడిక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా ఈ సభలో పాల్గొననున్నారు.

ఇప్పటికే ఖమ్మం సభను అభిమానులు భారీగా ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగనున్న సభలో కొత్త పార్టీ పేరుతో పాటు జెండాను షర్మిల ఆవిష్కరించే అవకాశముంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతున్న షర్మిల కాన్వాయ్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కాన్వాయ్‌లోని 4 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం వాహనాలు మాత్రమే దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం.

Advertisement

Next Story