కేసీఆర్‌కు అమ్ముడుపోయాడు.. హుజూరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Shyam |
కేసీఆర్‌కు అమ్ముడుపోయాడు.. హుజూరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఎన్నికలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్ ను వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు. ఎన్నికల నిబంధనలపై ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని లేదా బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, నామినేషన్ వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రకరకాల కారణాలు చూపుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు ముందుకు వస్తే తిప్పి పంపేస్తున్నారని కంప్లైట్ చేశారు.

సపోర్ట్ గా వచ్చే నాయకులను అడ్డుకుంటున్నారని, కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసీఆర్ కి తొత్తులుగా మారారని, పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కేసీఆర్ కి అమ్ముడుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ గడువు సమయం కూడా పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

Next Story